BHADRADRI NEWS
Newspaper Banner
Date of Publish : 21 August 2026, 10:37 am Posted by : BHADRADRI NEWS

దీపారాణి మృతికి సంతాపం తెలిపిన ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్

కొత్తగూడెం, ఆగస్టు 20 (తెలంగాణ వాణి) కొత్తగూడెం ఏరియా సివిల్ డిపార్ట్మెంట్‌లో పంప్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న కందుల విజయ్ రాజ్ సతీమణి కందుల దీపారాణి అనారోగ్యంతో మృతి చెందారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీపారాణి మృతి విషయం తెలుసుకున్న కొత్తగూడెం ఏరియా ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్ నాయకులతో కలిసి ఆమె పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం కందుల విజయ్ రాజ్ కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సకినాల సమ్మయ్య, సైమన్, జక్కుల సత్యనారాయణ, సివిల్ పిట్ కార్యదర్శి గూడూరి మల్లికార్జున్, పంప్, వాల్వ్ ఆపరేటర్లు కిన్నెర దశరథ్, అమర్ లాల్, బండారి కొమురయ్య, శ్రీపాల్ రెడ్డి, పరంజ్యోతి, రాము, గుండ శ్రీనివాస్, కవి రాజు, తెనుగు వెంకటేశ్వర్లు, ఇబ్రహీం తదితర నాయకులు, కార్యకర్తలు, డీఎల్ఆర్ కార్మికులు, మిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.