దీపారాణి మృతికి సంతాపం తెలిపిన ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్

కొత్తగూడెం, ఆగస్టు 20 (తెలంగాణ వాణి) కొత్తగూడెం ఏరియా సివిల్ డిపార్ట్మెంట్‌లో పంప్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న కందుల విజయ్ రాజ్ సతీమణి కందుల దీపారాణి అనారోగ్యంతో మృతి చెందారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీపారాణి మృతి విషయం తెలుసుకున్న కొత్తగూడెం ఏరియా ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్ నాయకులతో కలిసి ఆమె పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం కందుల విజయ్ రాజ్ కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యం కలగాలని ఆకాంక్షించారు....