భద్రాచలంలో 3వ ప్రమాద హెచ్చరిక జారీ

  భద్రాచలం (భద్రాద్రి న్యూస్): భద్రాచలం వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. శనివారం ఉదయం 10 గంటలకు గోదావరి నీటిమట్టం 56 అడుగులకు చేరుకోగా, 15,90,778 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అంకిత్ భద్రాచలం గోదావరి స్నాన ఘాట్లు, కరకట్ట ప్రాంతం, భద్రాచలం–కూనవరం ప్రధాన రహదారి వెంట వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహం, ప్రభావిత గ్రామాల పరిస్థితి, సహాయక చర్యలపై అధికారులతో సమీక్ష...