సింగరేణి మండలంలో ఆబ్కారీ శాఖ ఉందా… లేదా?

వైన్ షాపుల సిండికేట్‌పై ఎందుకు మౌనం? ఎమ్మార్పీకి మించి విక్రయాలు రాత్రి వేళ బెల్ట్ షాపుల దందా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలంటూ ప్రజల డిమాండ్ కారేపల్లి (భద్రాద్రి న్యూస్) సింగరేణి మండలంలో ఆబ్కారీ (ఎక్సైజ్) శాఖ పనితీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ఎమ్మార్పీ ధరల కంటే రూ.15 నుంచి రూ.30 వరకు అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు చాలాకాలంగా వినిపిస్తున్నప్పటికీ, సంబంధిత అధికారుల నుంచి క్షేత్రస్థాయిలో చర్యలు కనిపించడం లేదు. వైన్...