పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు
ఖమ్మం, ఆగస్టు 23 (భద్రాద్రి న్యూ): ఉమ్మడి ఖమ్మం–నల్లగొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావును పార్టీ ముందస్తుగా ప్రకటించింది. ఈ మేరకు జనసేన పార్టీ జాతీయ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. డాక్టర్ గడల శ్రీనివాసరావు ప్రస్తుతం జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, అధికార ప్రతినిధిగా, ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో వైద్య ఆరోగ్యశాఖలో ఉన్నతస్థాయిలో సేవలందించిన ఆయన.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వైద్య ఆరోగ్య...