BHADRADRI NEWS
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 12:59 pm Posted by : BHADRADRI NEWS

తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ త్యాగాలు, సేవలు చిరస్మరణయం

తెలంగాణ ప్రజల అభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేశారు 

కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ సి.హెచ్.వెంకటరమణ

కొత్తగూడెం ఏరియాలో ఘనంగా ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి

కొత్తగూడెం సింగరేణి (భద్రాద్రి న్యూస్)

తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ త్యాగాలు, సేవలు చిరస్మరణీయమని,తెలంగాణ ప్రజల అభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేశారని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ సి.హెచ్.వెంకటరమణ అన్నారు.ఈరోజు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై జయశంకర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జి.ఎం మాట్లాడుతూ ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ తెలంగాణ ప్రజల అభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేశారని, చిన్న వయస్సులోనే ఆయన తిరుగుబాటు భావనను ప్రదర్శించారన్నారు.తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ చేసిన త్యాగాలు, సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. సమాజాభివృద్ధి, ప్రజాసేవ, కర్తవ్యనిర్వహణలో ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని అంకితభావంతో పనిచేయాలని సూచించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన జయశంకర్ భావితరాలకు స్ఫూర్తిదాయకులని అన్నారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ విద్యావేత్తగా, ఆర్థికవేత్తగా, తెలంగాణ సిద్ధాంతకర్తగా సమాజంపై చెరగని ముద్ర వేసిన మహనీయుడని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఆయన అందించిన మేధోసహకారం, దూరదృష్టి, నిరంతర కృషి భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన బోధించిన విలువలు, నైతికత, సామాజిక బాధ్యతలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని, ప్రజా సంక్షేమం మరియు సమాజాభివృద్ధికి అంకితభావంతో పనిచేయడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు. తెలంగాణ ప్రగతికి ఆయన ఆశయాల సాధన దిశగా అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిఎం తో పాటు ఎస్వోటు జిఎం గోవిందరావు, ఐఎన్టియూసి వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్, ఏ‌ఐటిద‌యూ‌సి బ్రాంచ్ ఆఫీస్ బేరర్ సందేబోయిన శ్రీనివాస్ , ఏరియా సేఫ్టీ ఆఫీసర్ మొక్కపాటి వెంకటేశ్వర్లు, ఏజీఎం (సివిల్) సి.హెచ్. రామకృష్ణ, ఎజిఎం(ఫైనాన్స్) బిబత్స, ఏరియా ఇంజనీర్ వి. రామకృష్ణ, పర్సనల్ మేనేజర్ ఎల్.తిరుపతి, డి‌వై‌పి‌ఎం హరీష్ , సీనియర్ పీఓ మురళి , ఐఎన్టియూసి ఫిట్ సెక్రటరీ సిహెచ్. సాగర్, ఏ‌ఐటిఎ‌యూ‌సి ఫిట్ సెక్రటరీ కే.సౌజన్య, ఇతర విభాగ ఆధికారులు, ఉద్యోగులు, మరియు కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.