BHADRADRI NEWS
Newspaper Banner
Date of Publish : 27 September 2026, 4:24 pm Posted by : BHADRADRI NEWS

29న ఎస్జీఎఫ్ అండర్-17 రైఫిల్ షూటింగ్ పోటీలు

బాలబాలికలకు జిల్లా స్థాయి ఎంపికలు.. ఉదయం 8 గంటలకు ప్రారంభం

కొత్తగూడెం, సెప్టెంబర్ 27 (భద్రాద్రి న్యూస్): జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం, ఉమ్మడి ఖమ్మం జిల్లాల పరిధిలోని విద్యార్థులకు అండర్-17 బాలబాలికల రైఫిల్ షూటింగ్ పోటీలు, జిల్లా స్థాయి ఎంపికలు ఈ నెల 29న నిర్వహించనున్నట్లు ఖమ్మం ఎస్జీఎఫ్ కార్యదర్శి డా. ఎస్. రామారావు, భద్రాద్రి కొత్తగూడెం ఎస్జీఎఫ్ కార్యదర్శి బి. భావసింగ్, కోచ్, రేంజ్ ఇన్‌చార్జి ఎం.డి. అబ్దుల్ నబీ తెలిపారు.

కొత్తగూడెంలోని శ్రీరామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలోని జిల్లా ఇండోర్ రైఫిల్ షూటింగ్ రేంజ్‌లో మంగళవారం ఉదయం 8 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అండర్-17 విభాగానికి చెందిన బాలురు, బాలికలు ఈ ఎంపికల్లో పాల్గొనవచ్చని తెలిపారు.

ప్రత్యేక అర్హత నిబంధనలు

గతంలో సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐసీఎస్, ఎస్‌వీఓ తదితర క్రీడా పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు ఈ ఎంపికలకు అర్హులు కారని నిర్వాహకులు స్పష్టం చేశారు. కేంద్రీయ విద్యాలయ, నవోదయ, విద్యాభారతి పాఠశాలల విద్యార్థులకు కూడా అవకాశం లేదని తెలిపారు.

పాల్గొనే క్రీడాకారులు ప్రధానోపాధ్యాయుడు లేదా ప్రిన్సిపాల్ అటెస్టేషన్ చేసిన పత్రాల జిరాక్స్ కాపీలతో పాటు పూర్తిగా నింపిన ఎలిజిబిలిటీ ఫారమ్, బోన్‌ఫైడ్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్, గత విద్యా సంవత్సరం ప్రోగ్రెస్ రిపోర్ట్/మార్కుల మెమో, పాఠశాల ఎస్జీఎఫ్ అప్లికేషన్ ఫీజు చెల్లించిన రసీదు, అవసరమైన ఇతర ఎస్జీఎఫ్ ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు.ఆసక్తి ఉన్న క్రీడాకారులు నిర్ణీత సమయానికి అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో పోటీలు నిర్వహించే వేదికకు హాజరు కావాలని నిర్వాహకులు కోరారు. పూర్తి వివరాలకు కోచ్, రేంజ్ ఇన్‌చార్జి ఎం.డి. అబ్దుల్ నబీని 7842266833 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.