BHADRADRI NEWS
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 11:04 am Posted by : BHADRADRI NEWS

ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా రక్తదాన శిబిరం

ఇల్లందు, అక్టోబర్ 2 (భద్రాద్రి న్యూస్), గాంధీ జయంతిని పురస్కరించుకొని, సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ శిబిరంలో గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి. పార్వతి హాతీరామ్ నాయక్‌తో పాటు 45 మంది బీజేపీ కార్యకర్తలు రక్తదానం చేశారు. రక్తదానం ద్వారా అత్యవసర సమయంలో రోగులకు ప్రాణదాతలుగా నిలవవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బందితో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టౌన్ అధ్యక్షురాలు సుచిత్ర పాసి, జిల్లా ఉపాధ్యక్షులు బలగాని గోపి, భూక్యా శ్రీను నాయక్, మురళీకృష్ణ, మాధవ్, మహేష్, జాలె శ్రీను, సునీత, శంభు నాయక్, దరావత్ సురేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.