ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా రక్తదాన శిబిరం
ఇల్లందు, అక్టోబర్ 2 (భద్రాద్రి న్యూస్), గాంధీ జయంతిని పురస్కరించుకొని, సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ శిబిరంలో గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి. పార్వతి హాతీరామ్ నాయక్తో పాటు 45 మంది బీజేపీ కార్యకర్తలు రక్తదానం చేశారు. రక్తదానం ద్వారా అత్యవసర సమయంలో రోగులకు ప్రాణదాతలుగా నిలవవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో...