BHADRADRI NEWS
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 11:17 am Posted by : BHADRADRI NEWS

కొత్తగూడెంలో ఘనంగా జీవిత బీమా ఏజెంట్ల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కొత్తగూడెం, అక్టోబర్ 2 (భద్రాద్రి న్యూస్): భారతీయ జీవిత బీమా ఏజెంట్ల సమైక్య 1964 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన జెండా పండుగను కొత్తగూడెం బ్రాంచ్‌లో ఘనంగా నిర్వహించారు. బ్రాంచ్ సెక్రటరీ సంఘం భాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఇటీవల జోనల్‌కు ఎన్నికైన గంజి రాంబాబును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏజెంట్ల సంక్షేమం, సంఘం బలోపేతానికి ఐక్యంగా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. అనంతరం జోనల్ ఈసీ సభ్యుడిగా ఎన్నికైన గంజి రాంబాబును శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో బ్రాంచ్ అధ్యక్షుడు అల్లాడి నాగేశ్వరరావు, బ్రాంచ్ ఆర్థిక కార్యదర్శి కాసుల శంకర్, జోనల్ ఈసీ సభ్యుడు గంజి రాంబాబు, వరంగల్ డివిజన్ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ తాళ్లపల్లి సరస్వతి రాజేశ్వరరావు, వరంగల్ డివిజన్ ఈసీ సభ్యుడు ఎం. సాంబశివరావు, జి. ఉప్పలయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ మార్కాపూర్ నరసింహారావుతో పాటు సుమారు 25 మంది ఏజెంట్ మిత్రులు పాల్గొన్నారు.