కొత్తగూడెంలో ఘనంగా జీవిత బీమా ఏజెంట్ల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కొత్తగూడెం, అక్టోబర్ 2 (భద్రాద్రి న్యూస్): భారతీయ జీవిత బీమా ఏజెంట్ల సమైక్య 1964 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన జెండా పండుగను కొత్తగూడెం బ్రాంచ్‌లో ఘనంగా నిర్వహించారు. బ్రాంచ్ సెక్రటరీ సంఘం భాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఇటీవల జోనల్‌కు ఎన్నికైన గంజి రాంబాబును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏజెంట్ల సంక్షేమం, సంఘం బలోపేతానికి ఐక్యంగా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. అనంతరం జోనల్ ఈసీ సభ్యుడిగా ఎన్నికైన గంజి రాంబాబును శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో బ్రాంచ్...