ఎదురుగడ్డ హత్య కేసును చేదించిన లక్ష్మిదేవిపల్లి పోలీసులు
పాత కక్షలతోనే అఖిల్ హత్య.. నలుగురు నిందితుల అరెస్ట్! సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించిన పోలీసులు హత్యకు ఉపయోగించిన కత్తి, సెల్ఫోన్లు, రక్తపు మరకలున్న దుస్తులు స్వాధీనం లక్ష్మీదేవి పల్లి, అక్టోబర్ 28 (భద్రాద్రి న్యూస్):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎదురుగడ్డ గ్రామంలో సంచలనం సృష్టించిన మేడి అఖిల్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో పరారీలో ఉన్న నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన ఆయుధాలతో పాటు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు....