కారేపల్లి (భద్రాద్రి న్యూస్ రాములు) ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మంగళవారం కారేపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి స్టేషన్ పనితీరును సమీక్షించారు. రికార్డులు, పెండింగ్ కేసులు, శాంతిభద్రతల పరిస్థితి, నేరాల నియంత్రణ చర్యలను పరిశీలించి పెండింగ్ కేసులను వేగంగా పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో మర్యాదగా వ్యవహరించాలని, ఫిర్యాదులను నిర్ణీత గడువులో పరిష్కరించాలని సూచించారు. మహిళలు, చిన్నారులకు సంబంధించిన కేసుల విచారణలో ప్రత్యేక శ్రద్ధతో పాటు సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు.
స్టేషన్ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధుల నిర్వహణను పరిశీలించిన కమిషనర్ ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా పోలీసింగ్‌ను బలోపేతం చేయాలని సూచించారు. అనంతరం అధికారులు, సిబ్బందితో సమావేశమై శాఖ పనితీరు మెరుగుదలకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఖమ్మం ఏసీపీ తిరుపతి రెడ్డి, కారేపల్లి సీఐ నూనావత్ సాగర్, ఎస్ఐ గోపి తదితరులు పాల్గొన్నారు.
