Wednesday, September 30, 2026
spot_img
HomeCrimeమిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యంపై భగ్గుమంటున్న ముచ్చర్ల ప్రజలు

మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యంపై భగ్గుమంటున్న ముచ్చర్ల ప్రజలు

📰 Generate e-Paper Clip

గ్రామప్రజల దాహం తీర్చని మిషన్ భగీరథ అధికారులు 

ప్రజల దహం తీర్చి శభాష్ అనిపించుకున్న గ్రామ సర్పంచ్  జామ్ లూసి  

​కామేపల్లి, సెప్టెంబర్ 10 (భద్రాద్రి న్యూస్) గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తాగునీరు రాక స్థానికులు గ్రామ ప్రజలు అల్లాడుతున్నారు మిషన్ భగీరథ అధికారులు పట్టించుకోకపోవడంపై కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే గ్రామంలో మిషన్ భగీరథ మంచి నీటి సరఫరా నిలిచిపోయిందని దుయ్యబట్టారు. గ్రామంలో తాగునీటి ఎద్దడి తలెత్తడంతో స్థానిక గ్రామ సర్పంచ్ జాటోత్ జాయ్ లూసీ గురువారం ప్రజల అవస్థ చూడలేక మానవత్వ దృతత్వంతో చలించి పోయి ప్రజలకు త్రాగునీరు అందించాలని అనుకొని వెంటనే స్పందించి,ట్యాంకర్ల ద్వారా వీధి వీధికీ నీటిని సరఫరా చేసి శభాష్ అనిపించుకున్నారు వారికి గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అలాగే తాత్కాలికంగా దాహార్తి తీర్చారు. ప్రజాప్రతినిధి చూపిన శ్రద్ధ కూడా మండల అధికారులకు  ఎంపీఓ పట్టింపు లేకపోవడంపై చాలా దుర్మార్గపు చర్య అని ప్రజలు ముక్తకంఠంతో చెప్పుకుంటూ మండిపడుతున్నారు. ఇప్పటికైనా మిషన్ భగీరథ అధికారులు నిద్రమత్తు వీడి, తక్షణమే నీటి సరఫరాను పునరుద్ధరించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. లేనియెడల జిల్లా కలెక్టర్ అధికారుల దృష్టికి మిషన్ భగీరథ త్రాగునీటి సమస్యలను పట్టించుకోకపోతే తీవ్రతం చేస్తామని వారు అన్నారు పరిష్కార మార్గం చూపేందుకు అధికారులు తక్షణమే స్పందించి ప్రజలను ఆదుకోవాలని తెలిపారు. లేనియెడల. గ్రామంలో మహిళలను సమీకరించి కూడా పెట్టి ప్రధాన రహదారిపై ధర్నాలు రాస్తారోకోలు నిరసనలు కాలి బిందెలతో కాలినడకన కామేపల్లి మండల కేంద్రంలో ఉన్న మిషన్ భగీరథ కార్యాలయానికి ర్యాలీగా చేరుకుంటామని గ్రామ ప్రజలు హెచ్చరిస్తూ డిమాండ్ చేశారు

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHDR News App

Add to home screen for faster loading and latest updates.