Wednesday, September 30, 2026
spot_img
Homeభద్రాద్రిఅంకితభావంతో సేవలందించిన వారికి ఘన వీడ్కోలు

అంకితభావంతో సేవలందించిన వారికి ఘన వీడ్కోలు

📰 Generate e-Paper Clip

సింగరేణి సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన పదవీ విరమణ ఉద్యోగులు

రుద్రంపూర్ ఆర్‌సీఓఏ క్లబ్‌లో ఘనంగా సన్మానం

కొత్తగూడెం సింగరేణి ఆగస్ట్ 31 (భద్రాద్రిన్యూస్) సింగరేణి సంస్థలో సుదీర్ఘకాలం అంకితభావంతో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందుతున్న ఏజీఎం (సివిల్) రామకృష్ణ, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీనివాస్, శారధలకు ఘన వీడ్కోలు పలికారు. సోమవారం రుద్రంపూర్ ఆర్‌సీఓఏ క్లబ్‌లో వారి పదవీ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కొత్తగూడెం ఏరియా ఇన్‌చార్జ్ జనరల్ మేనేజర్ గోవిందరావు మాట్లాడుతూ.. రామకృష్ణ, శ్రీనివాస్ తదితరులు తమ సుదీర్ఘ ఉద్యోగ జీవితంలో క్రమశిక్షణ, నిబద్ధత, అంకితభావంతో విధులు నిర్వహిస్తూ సింగరేణి సంస్థకు విశేష సేవలు అందించారని అభినందించారు. తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.

ఉద్యోగ విరమణ ప్రతి ఉద్యోగి జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని, పదవీ విరమణ పొందుతున్న వారి అనుభవం, నిబద్ధత, సేవా స్ఫూర్తి సహచర ఉద్యోగులకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని జీఎం గోవిందరావు అన్నారు. పదవీ విరమణ అనంతరం వారు కుటుంబ సభ్యులతో కలిసి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ప్రశాంతమైన జీవితం గడపాలని ఆకాంక్షించారు.

అధికారులు మాట్లాడుతూ.. ఏజీఎం (సివిల్) రామకృష్ణ, అకౌంట్స్ ఆఫీసర్ శ్రీనివాస్, శారధ తమ తమ విభాగాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించి అందరి మన్ననలు పొందారని తెలిపారు. సింగరేణి సంస్థకు వారు అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

అనంతరం పదవీ విరమణ పొందుతున్న ముగ్గురిని అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల ప్రతినిధులు శాలువాలతో ఘనంగా సన్మానించి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా పదవీ విరమణ పొందుతున్న వారు మాట్లాడుతూ.. సింగరేణి సంస్థలో సేవలందించడం తమకు ఎంతో గౌరవప్రదమైన అనుభవమని అన్నారు. తమ ఉద్యోగ జీవితంలో సహకరించిన ఉన్నతాధికారులు, సహచర ఉద్యోగులు, కార్మికులు, సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా ఇన్‌చార్జ్ జనరల్ మేనేజర్ గోవిందరావు, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ జె. గట్టయ్య, ఐఎన్‌టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎం.డి. రజాక్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ మొక్కపాటి వెంకటేశ్వరరావు, ఏరియా ఇంజనీర్ వి. రామకృష్ణ, పర్సనల్ మేనేజర్ ఎల్. తిరుపతి, మేనేజర్ (ఐటీ) శేషశ్రీ, డీవైపీఎం హరీష్, ఐఎన్‌టీయూసీ ఫిట్ సెక్రటరీ సాగర్, ఏఐటీయూసీ ఫిట్ సెక్రటరీ సౌజన్యతో పాటు వివిధ విభాగాల అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు, సహచరులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHDR News App

Add to home screen for faster loading and latest updates.