Wednesday, September 30, 2026
spot_img
Homeభద్రాద్రిభద్రాచలంలో 3వ ప్రమాద హెచ్చరిక జారీ

భద్రాచలంలో 3వ ప్రమాద హెచ్చరిక జారీ

📰 Generate e-Paper Clip

 

భద్రాచలం (భద్రాద్రి న్యూస్): భద్రాచలం వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. శనివారం ఉదయం 10 గంటలకు గోదావరి నీటిమట్టం 56 అడుగులకు చేరుకోగా, 15,90,778 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది.

ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అంకిత్ భద్రాచలం గోదావరి స్నాన ఘాట్లు, కరకట్ట ప్రాంతం, భద్రాచలం–కూనవరం ప్రధాన రహదారి వెంట వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహం, ప్రభావిత గ్రామాల పరిస్థితి, సహాయక చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

 

లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించాలని, గ్రామాల్లో టామ్‌టామ్, మైకింగ్ ద్వారా నిరంతరం అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో తాగునీరు, భోజనం, వైద్య సేవలు, విద్యుత్, పారిశుద్ధ్యంతో పాటు గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, వృద్ధులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు.

 

వరద నీరు చేరిన ప్రాంతాల్లో బ్యారికేడ్లు ఏర్పాటు చేసి, ప్రజలు ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. గోదావరిలో స్నానాలు, ఈత, చేపల వేట, పడవ ప్రయాణాలు, వరద ప్రాంతాల్లో సెల్ఫీలు పూర్తిగా నివారించాలని ప్రజలకు సూచించారు.

 

అత్యవసర పరిస్థితుల్లో జిల్లా ఫ్లడ్ కంట్రోల్ రూమ్ 08744-241950 లేదా వాట్సాప్ నంబర్ 9392919743ను సంప్రదించాలని తెలిపారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, అధికారులు సూచించిన భద్రతా చర్యలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHDR News App

Add to home screen for faster loading and latest updates.