Wednesday, September 30, 2026
spot_img
HomeCrimeచాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగాలి

చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగాలి

📰 Generate e-Paper Clip

రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల జాతర, మడేలయ్యకు బోనాలు సమర్పణ

లక్ష్మీదేవిపల్లి


( భద్రాద్రిన్యూస్):- బానిసత్వపు సంకెళ్లను తెంచుకొని రజకుల సార్వభౌమాధికారాన్ని సాధించే దిశలో హక్కులకే పోరాడిన చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగాలని రజక సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శ్రీనగర్ గ్రామపంచాయతీ నుంచి కొత్తగూడెంలోని మున్సిపల్ రాజీవ పార్కు వద్దనున్న రజకుల కమ్యూనిటీ హాల్ ప్రాంగణం వరకు రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మడేలయ్యా ఆషాడం మాస బోనాలు జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రతి ఏడాది అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న రజకుల బోనాల జాతరను ఆషాడం మాస పర్వదినాన్ని పురస్కరించుకొని ఎంతో భక్తిశ్రద్ధలతో రజక కులస్తులు మడేలయ్యకు బోనాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. సమాజంలో చిన్నచూపు చూస్తున్న రజకుల పట్ల పాలకులకు కనువిప్పు కలగాలని రజకుల హక్కుల సాధనకు సంఘటితంగా పోరాడాలని నేతలు పిలుపునిచ్చారు. రజకుల సంక్షేమానికి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో ప్రత్యేకంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేయడం పట్ల అభినందనీయమని రజకుల అభ్యర్థన మేరకు కమ్యూనిటీ హాల్మంజూరుచేసిన కొత్తగూడెం శాసనసభ్యులుసాంబశివరావుకు
రజకకులస్తులందరూ రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనగర్ మాజీ ఉపసర్పంచ్ లగడపాటి రమేష్ ,రజక సంఘం నాయకులు నేరెళ్ల రమేష్ సుంకరఅజిత్, దురిశెట్టి కుమార్, భూస రాజు జంగపల్లి రాజు రాచకొండ హరి, సుంకర శేఖర్, సీమకుర్తి రామకృష్ణ, వెంకట్ , కందుకూరి ఈశ్వర్, రాగల్ల ప్రవీణ్, సర్వీష్, చిట్టెమ్మ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHDR News App

Add to home screen for faster loading and latest updates.